ఏపీలో కూటమి సర్కార్‌ ఏర్పాటై ఇంకా ఏడాది కూడా దాటకముందే  సీఎం చంద్రబాబు తన కేబినెట్‌లోని నలుగురు మంత్రులకు ఉద్వాసన చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఎవరెవరి పనితీరు ఎలా ఉంది.. పనిచేయని మంత్రులు ఎవరని సీఎం నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో తన కేబినెట్‌లో సరిగ్గా పనిచేయని ఆ నలుగురు మంత్రులపై వేటు పడే చాన్స్‌ ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

 ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక్క మంత్రికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే చాన్స్ ఉంది. అయితే ప్రస్తుత కేబినెట్‌లో సరిగ్గా పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలుతారని పార్టీ పెద్దలు చెప్పడంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా షాక్‌ అవుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం ఏడాది కూడా పూర్తవక ముందే మంత్రులకు ఉద్వాసన పలకడం ఏంటీ... ఉద్వాసనకు గురయ్యే మంత్రులు ఎవరు... కేబినెట్‌ నుంచి ఔట్‌ అయ్యే మంత్రులు ఎవరనే విషయాలపైన ప్రస్తుతం పార్టీలో కార్యకర్తలు చర్చించుకుంటున్నారని సమాచారం.

కేబినెట్ నుంచి పదవీచ్యుతులయ్యేవారిలో కొత్తవారి పేర్లే విన్ఫిస్తున్నాయి. అందులో కోనసీమ జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ను తొలగించే అవకాశం ఉంది. వాసంశెట్టి సుభాష్‌తో పాటు మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కు సైతం మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే చాన్స్‌ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరే కాకుండా మరో ఇద్దరు మంత్రులను కూడా సాగనంపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రివర్గంలో స్థానంలో నిశ్చయమైంది. జనవరి 8న మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే.. జనసేన మంత్రుల సంఖ్య ఐదుకు చేరుతుంది. అటు బీజేపీకి మాత్రం కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించారు. అయితే జనసేనకు చెందిన ఓ మంత్రిని తప్పించి.. బీజేపీలోని ఓ ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్‌ ఇవ్వాలని యోచిస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయగానే సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్‌ దగ్గర ఉండటంతో బదిలీ చేస్తారని చెబుతున్నారు. అటు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఎక్కువ శాఖలు ఉండటంతో.. ఆయన దగ్గర నుంచి కొన్ని శాఖలను ఇతరులకు మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos