కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న ‘చెత్త’ పన్ను నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. గత ప్రభుత్వ హయాంలో చెత్త పై పన్ను వసూళ్లు చేసిన విషయం తెలిసిందే. రూ. 187.02 కోట్ల మేర వసూలు చేసింది. అయితే, గత ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భారీ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ‘చెత్త’ పన్ను రద్దు హామీ అమలుపై దృష్టి సారించింది.

2021 నవంబర్ నెల నుంచి ఏపీలోని 40 పురపాలక, నగరపాలక సంస్థల్లో ప్రజల నుంచి చెత్త పన్ను వసూలును గత ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొద్దిరోజులకే.. చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ గత ఏడాది డిసెంబర్ నెలలో తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దానికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదల కావడంతో తాజాగా.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చెత్త పన్ను వసూలు చేయాలన్న సెక్షన్ ను తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. రెండు రోజుల క్రితమే విద్యుత్‌ వినియోగదారులపై ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టారిఫ్‌ను ప్రకటించింది. అంతేకాదు, అదనపు వెసులుబాట్లు సైతం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా.. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos