ఏపీలో విపక్ష వైసీపీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇవాళ ఘాటు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చెల్లి, తల్లితో జగన్ ఆస్తుల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి , ఓ రాజకీయ పార్టీకి ఏం న్యాయం చేస్తారంటూ గంటా ప్రశ్నించారు.
గతంలో పార్టీ కోసం పని చేసిన వారంతా ఒక్కొక్కరుగా వైసీపీని వీడి బయటకు వస్తున్నారన్నారు. త్వరలో మరి కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఇటీవల విజయమ్మ రాసిన లేఖతో పార్టీ వైసీపీ మునిగిపోయిందన్నారు.ఇప్పుడు జగన్ తప్ప ఆ పార్టీలో ఎవ్వరూ మిగలరన్నారు. 2004లో 92 లక్షల రూపాయలుగా ఉన్న వైఎస్ జగన్ ఆస్తులు.. 2009నాటికి రూ.370 కోట్లకు చేరాయని గంటా ఆరోపించారు. జగన్ మీద 47 కేసులు ఉన్నాయని, చంబల్ దేవి తర్వాత అత్యధిక కేసులు ఉన్నది ఆయన మీదేనని గంటా విమర్శించారు.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్రంతో మాట్లాతామని, అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామని జగన్ తెలిపారు. అలాగే రుషి కొండ భవనాల విషయంలోనూ ఏం చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల్ని నిలబెట్టుకుంటుందని గంటా తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos