గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుష్కరాల తేదీలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2027 సంవత్సరానికి వచ్చే గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగేలా నిర్ణయించింది. మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిధ్ధాంతి శ్రీ థంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన అభిప్రాయం మేరకు పుష్కరాల తేదీలను ఖరారు చేసారు. పుష్కరాల ప్రవేశ-ప్రస్థాన ఘడియలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఆయన చేసిన జ్యోతిష్య విశ్లేషణను దేవదాయ కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం, పుష్కరాలు జూన్ 26 ఉదయం ప్రారంభమై జూలై 7 వరకు కొనసాగుతాయని అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారన్న అంచనాతోపాటు, ప్రత్యేక రోజుల్లో గరిష్ఠంగా 75,000 మంది వరకూ వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే హాజరయ్యే భక్తుల అంచనాతోపాటు వివిధ సౌకర్యాల గురించి చర్చలు జరిపారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తునందున ఈ ప్రాంతాలలో పుష్కర పనులు వేగవంతమయ్యేలా చూస్తున్నది. తాజాగా దీనికి సంబంధించి పలు శాఖలు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.. రద్దీ నియంత్రణ పైన ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఘాట్‌లో 50 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందులోనే 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చే గదులు, 6 వాటర్‌ ఏటీఎంలు, అందుబాటులోకి తీసుకొస్తారు.

మరోవైపు కేంద్రం.. రైల్వే శాఖ సైతం పుష్కరాల ఏర్పాట్లలో ముందుకు వచ్చాయి. ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల కోసం టెంట్ సిటీలు, ఘాట్ల నిర్వహణ.. భక్తులకు వసతి కల్పించేలా ప్రభుత్వం కసత్తు చేస్తోంది. ఇప్పటికే నియమించిన మంత్రివర్గ ఉప సంఘం కుంభమేళాలో అనుసరించిన విధానాలపై కసరత్తు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos