ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. అమరావతి అసైన్డ్‌ రైతుల బ్యాంకు ఖాతాల్లో వార్షిక కౌలు అకౌంట్‌లలో జమ చేసింది. రాజధానిలో సీఐడీ క్లియరెన్సు ఇచ్చిన రైతుల వివరాలు పరిశీలించి.. సీఆర్డీఏ అధికారులు బిల్లులు అప్‌లోడ్ చేయడంతో డబ్బులు జమ అయ్యాయి. గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం నుంచి అమరావతిలో ఎలాంటి ఇబ్బందులు లేని.. అసలు పత్రాలతో సరిపోలిన 1,479 అసైన్డ్‌ రైతుల వివరాలను సీఆర్డీఏ సేకరించింది. రైతుల వివరాలను సీఆర్డీఏ అధికారులు పరిశీలించిన తర్వాత.. 1, 2, 3 కేటగిరీల్లో వివాదాల్లేని 1,328.17 ఎకరాలకు సంబంధించి 1,234 మంది అసైన్డ్‌ రైతులను అర్హులుగా గుర్తించారు.

1,234 మంది రైతులను కౌలు చెల్లింపునకు అర్హులుగా గుర్తించారు.. వారికి డబ్బులు జమ చేశారు. ఈ మేరకు సీఐడీ, గుంటూరు కలెక్టర్, ప్రభుత్వానికి సీఆర్డీఏ అధికారులు సమాచారం ఇచ్చి.. వారి నుంచి ఎన్వోసీలు కూడా తీసుకున్నారు. రైతులకు సంబంధించిన కౌలు డబ్బులు రూ.22.03 కోట్లకు బిల్లులను ఇటీవల సీఎఫ్‌ఎంఎస్‌లోకి అప్‌లోడ్‌ చేయగా.. ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మరోవైపు సీఐడీ అధికారులు తిరస్కరించిన జాబితాలో ఉన్న మిగిలిన రైతులకు సంబంధించిన కౌలు అంశాన్ని త్వరగా పరిష్కరించేందుకు సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిని త్వరలోనే ఓ కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో.. సీఐడీ విచారణ పేరుతో అసైన్డ్‌ రైతులకు కౌలు ఆగిపోయింది. జూన్ నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు.. అమరావతి అసైన్డ్‌ రైతుల సమస్యలను పరిష్కరించాలని సీఆర్డీఏ అధికారుల్ని ఆదేశించారు. ఆ వెంటనే మొదటి విడతలో ఇటీవల పలువురు అర్హులను గుర్తించి వారికి కౌలు డబ్బులు జమ చేశారు. ఇప్పుడు తాజాగా మరికొందరికి డబ్బులు జమ అయ్యాయి. గత మూడేళ్లుగా కౌలు రాక అమరావతిలో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా ఇప్పుడు మూడేళ్ల కౌలు డబ్బులు పడడంతో ఊరట దక్కిందనే చెప్పాలి.

అమరావతిలో భూముల విషయంలో కుంభకోణం జరిగిందని అప్పట్లో మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 2014 - 19 మధ్య కాలంలో జరిగిన అసైన్డ్‌ భూముల లావాదేవీలపై దర్యాప్తు జరిగింది.. దీంతో 2021 నుంచి అమరావతి అసైన్డ్‌ రైతులకు కౌలు ఆగిపోయింది. అమరావతి నిర్మాణం కోసం సమీకరణలో ఇచ్చిన భూముల్లో.. ఆరు విభాగాలకు చెందిన 3 వేల మందికి సంబంధించి 2,689.14 ఎకరాల మేర అసైన్డ్ భూములు ఉన్నాయి. అయితే ఈ భూముల్లో 3,139 మంది అసైన్డ్‌ రైతుల్లో కౌలుకు అర్హులంటూ.. 2,472 మందిని గుర్తించారు. వారికీ కూడా కౌలు చెల్లించలేదు. ఇప్పుడు వరుసగా వారికి డబ్బుల్ని జమ చేస్తున్నారు

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos