ఏపీ రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్‌ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బుధవారం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను విడుదల చేశారు. పెండ్లిమర్రి పర్యటనలో భాగంగా చంద్రబాబు మన గ్రోమోర్‌ ఎరువుల కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించారు. ఆ తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని 47 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3200 కోట్ల నిధులు విడుదల చేసింది. ఒక్కో రైతుకు రూ.7000చొప్పున జమ చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5000 కాగా.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద రూ.2000 అందిస్తోంది.

అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల నేపథ్యంలో.. రైతులు తమకు డబ్బులు అందాయో లేదో, ఏ బ్యాంకుకు పడ్డాయనే దానిపై స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. వెబ్‌సైట్లో Know Your Status అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు నంబర్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నంబరు, కాప్చా ఎంటర్ చేసిన తర్వాత..సెర్చ్ బటన్ నొక్కాలి. అనంతరం వివరాలు కనిపిస్తాయి. అర్హులై ఉంటే ఆ రైతు పేరు జిల్లా, మండలం, గ్రామం వివరాలు కనిపిస్తాయి. అలాగే పథకం స్టేటస్ గురించి సమాచారం అక్కడ ఉంటుంది.

రైతులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేశారా, లేదాఅనే వివరాలు కూడా తెలుస్తాయి. అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు ఏ బ్యాంక్ ఖాతాలోకి పడ్డాయనే వివరాలు కూడా తెలుస్తాయి. మరోవైపు పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) కింద పెట్టుబడి సాయం కూడా విడుదలయింది. ఈ స్కీమ్ కింద 21వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా కోయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మంది రైతుల అకౌంట్లలోకి రూ.18,000 కోట్లకు పైగా పెట్టుబడి సాయం నిధులను జమ చేశారు.  ప్రతి నాలుగు నెలలకు ఓ సారి కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తున్నది. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos