ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేపల వేట నిషేధం సమయంలో ప్రభుత్వం ఇచ్చే చేయూతను ఇవాళ విడుదల చేయనుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 10వేలు మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు దాన్ని 20 వేలకు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు ఈ మత్స్యకారులకు ఇచ్చే చేయూత కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పర్యటించి అక్కడ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. బుడగట్లపాలెంలో మత్స్యకారులతో మాట్లాడి వారికి ప్రభుత్వం ఇచ్చే చేయూత అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,29,178 కుటుంబాలకు మత్స్యకార చేయూత కార్యక్రమం ద్వారా లబ్ధి జరగనుంది. ఒక్కో కుటుంబానికి 20 వేల చొప్పున పంపిణీ చేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో బయల్దేరి మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు. నేరుగా బుడగట్లపాలెంలోని అమ్మవారి దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్లి మత్స్యకారులతో సమావేశమవుతారు. అనంతరం లబ్ధిదారులకు మత్స్యకార చేయూత నిధులు అందజేస్తారు. సీఎం చంద్రబాబు ఈ పథకం ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.258 కోట్ల నగదు జమ చేస్తారు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు బుడగట్లపాలెంలో ప్రజావేదిక వద్దకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం ఎచ్చెర్లలో పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశం కానున్నారు.
చేపల పునరుత్పత్తి కాలంలో అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేటను నిషేధిస్తారు. ఆ టైంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరు. అలా వెళ్లిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుటుంది. అందుకే ఆ సమయంలో మత్స్యకారులకు ఉపాధి ఉండదని సాయం చేస్తుంటుంది ప్రభుత్వం. చేపల సంతతిని కాపాడటానికి, ససముద్ర పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ సీఎం చంద్రబాబు మత్స్యకారులకు సాయం అందించే పథకం ప్రారంభించబోతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos