ఏపీ లోని కాలేజ్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మరో రూ. 600 కోట్లను విడుదల చేసినట్టుగా తెలిపింది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి గానూ... ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 788 కోట్లు విడుదల చేశామని, తాజాగా రూ. 600 కోట్లు విడుదల చేశామని, మరో రూ. 400 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

''విద్యాసంస్థలకు ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నది. ఈ నిబద్ధతలో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25కి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేసింది. ఇందుకు కొనసాగింపుగా, 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నేడు అదనంగా రూ. 600 కోట్లు విడుదల చేశారు. ఇంకా, త్వరలో రూ. 400 కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఫీజు చెల్లింపుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని లేదా ఎటువంటి బలవంతపు వ్యూహాలను ఉపయోగించవద్దని విద్యా సంస్థలకు ఇందుమూలంగా సూచిస్తున్నామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను తరగతులకు హాజరుకానివ్వకుండా చేయడం, హాల్ టిక్కెట్లను నిలిపివేయడం, పరీక్ష హాలులోకి అనుమతించకపోవడం... వంటి ఏదైనా బలవంతపు చర్యలకు పాల్పడటం చట్టవిరుద్ధం, ఆమోదయోగ్యం కానిదిగా పరిగణించబడుతుంది. ప్రభుత్వం ఇటీవల 12-03-2025న ఒక మెమోరాండం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని,  ఇటువంటి ఘటనలకు పాల్పడితే తీవ్రమైన శిక్షార్హమైన చర్యలు తీసుకోబడతాయని ప్రకటనలో స్పష్టం చేశారు. వైస్ ఛాన్సలర్లు తమ అధికార పరిధిలోని అన్ని అనుబంధ సంస్థలలో ఈ ప్రభుత్వ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తున్నాం. ఉల్లంఘనలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని, నిబంధనలను పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కోన శశిధర్ తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos