ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నియామకాలపైన మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల జారీ ముహూర్తం ఖరారైంది. మొత్తంగా 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదల కానుంది. 19న అమరావతిలో సభ ఏర్పాటు చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వీరికి దసరా సెలవుల్లో శిక్షణ ఇచ్చి... ఆ తరువాత విధుల్లో చేరేలా కార్యాచరణ ఖరారు చేసారు.

ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే 19వ తేదీన సభ నిర్వహించి.. అక్కడే ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అమరావతిలోని సచివాలయం సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్ధుల జాబితాలను మరోసారి అధికారులు నిశితంగా పరిశీలన చేస్తున్నారు. వీటిని ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి చేసి జాబితాలను జిల్లాలకు పంపి డీఎస్సీ కమిటీలతో సంతకాలు చేయిస్తారు. అనంతరం 15న తుది జాబితాలు ప్రకటిస్తారు. 19న వీరికి నియామక పత్రాలను జారీ చేయనున్నారు.

అపాయింట్ మెంట్ లెటర్స్ అందుకున్న వారికి దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. సెలవుల్లో శిక్షణ పైన అభ్యంతరాలు వస్తే ఆ తరువాత ట్రైనింగ్ పూర్తి చేయాలనే మరో ప్రతిపాదన సిద్దం చేసారు. దసరా సెలవుల తరువాత ఆక్టోబర్ 3వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే కొత్తగా టీచర్ ఉద్యోగాలు పొందిన వారు విధుల్లో చేరే విధంగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos