ఏపీలో నెల రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద చికిత్సల కోసం వెళ్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. దీనికి కారణం స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ కు ప్రభుత్వం ఈ చికిత్సల కోసం చెల్లించాల్సిన రీయింబర్స్ మెంట్ మొత్తం చెల్లించకపోవడమే. దీంతో ఆయా ఆస్పత్రులు సేవల్ని నిలిపేశాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తమకు బకాయి పెట్టిన రూ.2700 కోట్లు చెల్లిస్తే కానీ తాము ఎన్టీఆర్ వైద్య సేవల్ని పునరుద్దరించబోమని ప్రైవేట్ ఆస్పత్రులు తేల్చిచెప్పేశాయి. దీంతో ప్రభుత్వం వారికి ప్రస్తుతానికి రూ.250 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. దీనికి ఆయా ఆస్పత్రులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ మరో దఫా ప్రైవేటు ఆస్పత్రుల సంఘంతో ప్రభుత్వ వర్గాలు చర్చలు జరిపాయి. చర్చలు సఫలం కావడంతో నెట్‍వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సమ్మె విరమించేందుకు అంగీకరించినట్లు తెలిపింది.  దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకు గాను పది రోజుల్లో రూ.670 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో 15 రోజుల్లో మిగిలిన బకాయిలు చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు పేరుకుపోతున్న ఎన్టీఆర్ వైద్యసేవ బకాయిల్ని చెల్లించేందుకు అధికారులు ముందుకు రాకపోవడం, పలుమార్లు వినతులు పంపుతున్నా పట్టించుకోకపోవడంతో ఆస్పత్రుల్లో సేవలు నిలిపేసారు. అయితే ప్రస్తుతానికి 670 కోట్లు  చెల్లించే హామీ ఇవ్వడంతో ఆస్పత్రులు సేవలు పునరుధ్ధరించాయి. అన్న మాట ప్రకారం 10 రోజుల్లో ఈ మొత్తం చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos