భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల విస్తరణకు రైల్వే వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ మార్గంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఇదే క్రమంలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా హై స్పీడ్ రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఆలోచన చేస్తున్నది భారతీయ రైల్వే. బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేస్తుంది. హైదరాబాద్ చెన్నై మధ్య దక్షిణాది రాష్ట్రాలలో హైస్పీడ్ రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి బుల్లెట్ రైలు కారిడార్ ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం మొదలుపెట్టింది. ఒకవేళ ఇదే కనుక సాధ్యమైతే దక్షిణాదిలో ఇది మొదటి బుల్లెట్ రైలు మార్గం కాబోతుంది. దీనిపై అధ్యయనం పూర్తయిన తర్వాత హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్ కు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను సిద్ధం చేసి రంగంలోకి దిగనున్నారు అధికారులు. ఈ బుల్లెట్ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. దీంతో హైదరాబాద్ చెన్నై మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నైకి ప్రయాణం చేయాలంటే 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ బుల్లెట్ రైలు వస్తే కేవలం రెండు గంటల 20 నిమిషాలలోనే చెన్నైకు చేరుకోవచ్చు. ఇక రైల్వే శాఖ దక్షిణాదిలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సర్వేకు ఆదేశించినట్టు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ రైల్వే కారిడార్ హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలను కలుపుతుందని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇది ఈ నాలుగు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించి. ఐదు కోట్లకు పైగా జనాభా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని చంద్రబాబు విశాఖ వేదికగా పేర్కొన్నారు. భారతదేశంలో హై స్పీడ్ రైల్వే నెట్వర్క్ ను అభివృద్ధి చేయడానికి రైల్వే శాఖ గతంలో కొన్ని మార్గాలను గుర్తించింది. ఇప్పుడు ఈ జాబితాలో హైదరాబాద్ చెన్నై మార్గం కూడా చేరడం దక్షిణాది రాష్ట్రాలకు శుభవార్త అని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos