నిరుద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. సమ్మర్ హాలిడేస్ పూర్తయి, స్కూల్స్ రీఓపెన్ అయ్యే సమయానికి టీచర్ల భర్తీ పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీపై అప్ డేట్ ఇచ్చారు.
"గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రాష్ట్ర ప్రజలు గత పాలనతో విసిగి మాకు మద్దతు ఇచ్చారు. ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అందాలి. వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తాం. జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌తో అమరావతిని అభివృద్ధి చేస్తామని" చంద్రబాబు పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos