ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. అది కూడా రాజధాని అమరావతి విషయంలో.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అమరావతి నిర్మాణం మరో అడుగు ముందుకు వేసింది. రాజధాని అమరావతిలో కీలకమైన రెండు ప్రాజెక్టులకు కేంద్రం మంగళవారం రాత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువు దీరనున్నాయి. అయితే అవి వేర్వేరుగా కాకుండా ఒకేచోట ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మించనున్నారు. అలాగే ఈ ఉమ్మడి కేంద్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ రెండు ప్రాజెక్టులను రూ.2,787 కోట్లతో చేపట్టనున్నారు.

కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ రూ.1,458 కోట్ల వ్యయంతో, ఉద్యోగుల నివాస సముదాయం రూ.1,329 కోట్లు ఖర్చు చేసి నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలకు.. కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులను కూడా కేంద్ర ప్రజాపనుల విభాగం చేపట్టనుంది.

మరోవైపు కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం 2018లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూమి కేటాయించింది. అమరావతి రాజధానిలో కేంద్ర ప్రజాపనుల విభాగానికి 22.53 ఎకరాలు కేటాయించింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ మూడు రాజధానుల విధానాన్ని అనుసరించటంతో అమరావతి నిర్మాణం అటకెక్కింది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో అమరావతికి పునర్వైభవం వచ్చింది. రాజధాని నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం నిర్వహించి.. పనులు మొదలెట్టారు.

ఈ క్రమంలోనే కీలకమైన ఈ రెండు ప్రాజెక్టుల్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. రాజధానిలో సీపీడబ్ల్యూడీకి 22.53 ఎకరాల కేటాయించేందుకు మళ్లీ ఆమోదం తెలిపింది. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలసిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం రాత్రి ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos