ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరికి చెందిన ఓ కీలక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వేశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళగిరి - కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య E13 ఎక్స్‌టెన్షన్ రోడ్డు వద్ద ఆర్వోబీ నిర్మాణ ప్రతిపాదనకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఆర్వోబీని రూ.112 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించనున్నారు. ఈ ఆర్వోబీ రాజధాని అమరావతిని, 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానించేలా నిర్మించనున్నారు. మరోవైపు ఈ ఆర్వోబీకి అయ్యే నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా రైల్వేశాఖ భరించనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ ఆర్వోబీ తొలుత నాలుగు లైన్లుగా నిర్మించాలని భావించారు. అయితే అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆరు వరుసలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. మరోవైపు ఈ ప్రాజెక్టు టెండరింగ్ ప్రక్రియ చేపట్టేముందు మరికొన్ని పనులు పూర్తి చేయనున్నారు. డిజైన్ల ఆమోదం, సాధారణ డ్రాయింగ్‌లు వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఆర్వోబీ నిర్మాణం పూర్తి అయితే అమరావతి వైపు వెళ్లే రహదారి ట్రాఫిక్ సజావుగా సాగడానికి సహకరిస్తుందని అధికారులు చెబుతున్నారు.

మంగళగిరి - కృష్ణా కెనాల్ స్టేషన్ల మధ్య ఆరు వరుసల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి వెల్లడించారు. 112 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ఆర్వోబీ అమరావతిని, 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చును దక్షిణ మధ్య రైల్వే భరించనున్నట్లు వివరించారు. ప్రతిపాదించిన ఈ రైల్వే ట్రాక్ చెన్నై-హౌరాను విజయవాడ మీదుగా కలిపే ముఖ్యమైన లైన్ అని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో చాలా రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఈ క్రమంలోనే అమరావతిలో ఆర్వోబీ నిర్మాణ ప్రతిపాదనకు తాజాగా రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos