ఏపీ మాజీ హోం మంత్రి సుచరిత కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా సుచరిత వైసీపీ వీడుతున్నారనే ప్రచారం ఉంది. ఎన్నికల సమయంలోనే ఈ ప్రచారం మొదలైంది. తాజా ఎన్నికల్లో సుచరిత తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు కాదని, తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జగన్ గుంటూరు వచ్చినా ... ఆమె ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు జగన్ తో సమావేశమైన సుచరిత తన నిర్ణయం వెల్లడించారు. రాజకీయాలకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారని సమాచారం.

అనారోగ్య కారణాలతో రాజకీయాల్లో కొనసాగలేనని సుచరిత వెల్లడించగా... కొంత కాలం ఆగి నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. కానీ, తన వ్యక్తిగత సమస్యలను సుచరిత వివరించి.. తాను ఏ పార్టీలోనూ చేరటం లేదని.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారని... తాడికొండలో తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని సూచించారని తెలుస్తోంది. దీంతో, రాజకీయాల నుంచి సుచరిత వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు దాదాపుగా ఖరారు అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మేకతోటి సుచరిత 2009 లో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 లో జగన్ కోసం రాజీనామా చేసి ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. తిరిగి 2014లో ఓడిపోయారు. కాగా, 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో సుచరితకు జగన్ హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ ప్రక్షాళన వేళ సుచరిత పదవి కోల్పోయారు. ఆ సమయం లోనే కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. జగన్ ను కలిసిన తరువాత తాను పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసారు. ఇక, 2024 ఎన్నికల వేళ సుచరిత ప్రత్తిపాడు కాదని... తాడికొండ నుంచి పోటీ చేసారు. సుచరిత అభ్యర్ధన మేరకే సీటు కేటాయించినా.. అక్కడ ఓడిపోయారు.

ఎన్నికల ఫలితాల తరువాత నుంచి పార్టీ కార్యక్రమాలకు సుచరిత దూరంగా ఉంటున్నారు. జగన్ తాజాగా రెండు సార్లు గుంటూరుకు వచ్చారు. సుచరిత మాత్రం దూరంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలోనే సుచరిత పార్టీ మార్పు పైన ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రత్తిపాడు, తాడికొండలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సుచరిత జనసేన వైపు చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జనసేనలోని ముఖ్య నేతలు సైతం మాట్లాడినట్లు తెలిసింది. అయితే, తాను రాజకీయాల్లోనే ఉండాలని అనుకోవటం లేదని తాజాగా సుచరిత సమాచారం ఇచ్చారు. ఇక, ఇప్పుడు జగన్ తో భేటీలో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos