వైసీపీని ముఖ్య నేతలు వీడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి కొందరు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రతిపక్షం లో ఉన్న సమయంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించి.. అధికారంలోకి వచ్చిన తరువాత కీలక పదవి నిర్వహించిన నేత పార్టీ వీడుతున్నారు. ఇప్పుడు ఆ నేత బాటలోనే మరి కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.

మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో క్రియాశీలకంగా పని చేసారు. అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పని చేసారు. తాజా ఎన్నికల సమయంలో జగ్గయ్య పేట సీటు ఆశించారు. తనకు లేదా తన భర్తకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఎన్నికల సమయంలో పద్మ మాజీ సీఎం జగన్ పైన ఒత్తిడి తెచ్చారు. కానీ, దక్క లేదు. అప్పటి నుంచి తన పదవికి రాజీనామా చేసిన పద్మ..రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిన తరువాత ఆమె పార్టీ వీడుతారనే ప్రచారం సాగింది. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు.

వాసిరెడ్డి పద్మ జనసేనలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాసిరెడ్డి పద్మ ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆమె వైసీపీలో చేరారు. వైసీపీలోనూ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇప్పుడు వైసీపీ వీడాలని నిర్ణయించటంతో జనసేన లో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. పవన్ తో పాటుగా జనసేన ముఖ్యులతో వాసిరెడ్డి పద్మకు ఉన్న పరిచయాలతో అటు వైపే అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.

ఇక, ఇప్పుడు వాసిరెడ్డి పద్మ రాజీనామాతో ఈ లిస్టులో నెక్స్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే సామినేని ఉదయభాను, బాలినేని జనసేనలో చేరారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన మోపిదేవి, బీదా మస్తాన రావు టీడీపీ కండువా కప్పుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం టీడీపీతో టచ్ లోకి వెళ్లారు. ఇక, ఇప్పుడు వైసీపీలోని మరో ఇద్దరు మాజీ మంత్రులు పార్టీ వీడబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇంకా మున్ముందు ఆ పార్టీలో ఏం జరగబోతుందో చూడాలి మరి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos