మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు. కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు... టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు, ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని... ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని ఆరోపణలు చేశారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెబుతూనే చంద్రబాబును, లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని... ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు. మరోవైపు, మైలవరం ఎమ్మెల్యే టికెట్ ను దేవినేని ఉమకు కాకుండా వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోపక్క ఇప్పటికే దేవినేని ఉమతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో మైలవరం టిక్కెట్ వసంత కృష్ణప్రసాద్ కు ఇవ్వడం తప్పడం లేదనే కామెంట్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ విషయంపై స్పందించిన ఉమ... చంద్రబాబు మాటే తనకు శిరోధార్యం అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అని ఉమ చెప్పుకున్నారు. కాగా దేవినేని ఉమను పెనమలూరు నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos