ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులు తిరిగి వేగం పుంజుకున్న నేపథ్యంలో తొలి ప్రభుత్వ భవనంగా రూపుదిద్దుకున్న సీఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ప్రారంభించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చింది. ఈరోజు సోమవారం ఉదయం 9.54 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యాలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం భవనాన్ని కలియతిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, భవన నిర్మాణ శైలి, ఇక్కడి సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాంగణంలో G+7 అంతస్తుల ప్రధాన భవనంతో పాటు మరో నాలుగు ప్రీ-ఇంజినీర్డ్ భవనాలను (పీఈబీ) కూడా నిర్మించారు. ఇకపై సీఆర్డీయే, ఏడీసీఎల్ (అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) కార్యాలయాలతో పాటు పురపాలక శాఖకు చెందిన అన్ని విభాగాల కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. దీనివల్ల పరిపాలనలో సమన్వయం పెరిగి పనులు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రారంభోత్సవానికి ముందు సీఎం చంద్రబాబు భూములిచ్చిన రైతులతో కాసేపు ముచ్చటించారు. రాజధాని నిర్మాణానికి రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos