ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకు ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. కొంతకాలంగా బదిలీల పైన చర్చ సాగుతున్నా.. ఇప్పుడు కొలిక్కి వచ్చింది. రాష్ట్రస్థాయి తో పాటుగా పలు జిల్లాల కలెక్టర్లు.. ఎస్పీలకు స్థాన చలనం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన శాఖల అధిపతులు మారనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలం పూర్తి కానుండటంతో... అధికారుల పనితీరు ప్రామాణికంగా మార్పులు చేసేందుకు సీఎం చంద్రబాబు సమాయత్తం అయ్యారు.

కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఒకే సారి 62 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. అదే విధంగా భారీ స్థాయిలో ఐపీఎస్ బదిలీలు జరిగాయి. పాలనా సౌలభ్యం కోసం మధ్యలో కొందరి అధికారుల బదిలీలు జరిగాయి. ఇక.. ఏడాది పాలన పూర్తయిన తరువాత అధికారుల పనితీరు ఆధారంగా మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఈ మేరకు కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రధాన శాఖల అధిపతుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు బదిలీల జాబితాలో ఉన్నట్లు సమాచారం. పలు ప్రధాన శాఖల్లో మంత్రులు - శాఖాధిపతుల మధ్య సమన్వయం సరిగ్గా లేదు. దీంతో, వీరి విషయంలోనూ చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అమరావతి వ్యవహారాలు కీలకంగా మారుతున్నాయి. దీంతో.. రాజధాని పరిధిలో ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఆరోగ్య, వ్యవసాయ, కార్మిక, విద్యుత్ శాఖల్లోనూ ముఖ్య అధికారులకు స్థాన చలనం కలగనున్నట్లు సమాచారం. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బాధ్యతల్లోనూ మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు జిల్లాల ఎస్పీలు మారే అవకాశం కనిపిస్తోంది. కరెక్ట్‌ ఆఫీసర్‌ ఇన్‌ కరెక్ట్‌ పొజీషన్‌ అన్న పద్దితిలో అన్నీ పరిశీలించి బదిలీలపై చంద్రబాబు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో.. ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే ఉత్తర్వుల పైన ఆసక్తి నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos