ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమరావతి పనులు కొనసాగుతున్నాయి. మూడేళ్ల కాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. రైతుల నుంచి మరో 1800 ఎకరాల భూ సమీకరణ పైన కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ దసరా రోజున మరో నిర్ణయం అమలుకు డిసైడ్ అయ్యారు. అమరావతిలో చుక్క నీరు నిలవదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
అమరావతిలో నిర్మిస్తున్న సీఆర్డీఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసి దసరా నాటికి ఈ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణం జరుగుతోందని మంత్రి నారాయణ వెల్లడించారు. దీనికి సమీపంలో మరో 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనుసంధాన నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. 2014-19లోనే ఈ భవనాన్ని పూర్తి చేశామని గుర్తు చేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సాంకేతిక కమిటీని నియమించి సూచనలు తీసుకున్నామని తెలిపారు. అనంతరం మిగతా పనులకు టెండర్లు పిలిచి పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. అదే సమయంలో రాజధాని పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
అమరావతిలో జరుగుతున్న ఈ పనుల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సీఆర్డీఏ ఏర్పాటు చేయబోతోంది. ఇది రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులు సరైన సమయంలో పూర్తయ్యేలా చూస్తుంది, అలాగే ఈ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న సీఆర్డీఏ కార్యాలయంలోని కింది అంతస్తులో ఇది రానుంది. దీనికి ఆసక్తి గల సంస్థల నుంచి సీఆర్డీఏ ఆర్‌ఎఫ్‌పీ పిలిచినట్లుగా చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos