ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయసభల సంయుక్త భేటీ జరిగింది. ఇందులో ఇరుసభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఇందులో ఆయన సీఎం చంద్రబాబు పేరు తప్పుగా చదివారు. దీంతో కాసేపు సభలో సభ్యులు ఆశ్చర్యపోయారు. గవర్నర్ ఇలా సీఎం పేరునే తప్పుగా చదవడంపై పలువురు సభ్యులు చెవులు కొరుక్కోవడం కనిపించింది. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో.. గవర్నర్ తన తొలి రోజు ప్రసంగంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును నరేంద్ర చంద్రబాబు నాయుడిగా చదివారు. ప్రసంగం కాపీ చూస్తూనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇలా రాష్ట్రమంతటికీ తెలిసిన చంద్రబాబు పేరును నరేంద్ర చంద్రబాబుగా చదవడంపై సోషల్ మీడియాలోనూ మీమ్స్ కనిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు తోటి సభ్యుల్ని ఆరా తీస్తున్నారని సమాచారం
వాస్తవానికి అసెంబ్లీలో గవర్నర్లు చేసే ప్రసంగాల కాపీల్ని ప్రభుత్వమే తయారు చేసి ఇస్తుంది. ఇందులో ఎలాంటి తప్పులు దొర్లకుండా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. అలాగే ఈ ప్రసంగాలు సైతం అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వాలకు, నేతలకు అనుకూలంగానే ఉంటాయన్న పేరు కూడా ఉంది. అలాంటి గవర్నర్ ప్రసంగంలో సభా నాయకుడైన చంద్రబాబు పేరునే తప్పుగా ప్రస్తావించడం ద్వారా గవర్నర్ ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos