ఆంధ్రప్రదేశ్ లో రేపు అంటే ఆదివారం జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై క్లారిటీ వచ్చేసింది. ఫిబ్రవరి 23న ఏపీ గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) స్పష్టం చేసింది. కొందరు అభ్యర్థులు వాయిదా వేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలపై గందరగోళం నెలకొంది. అయితే పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఎగ్జామ్ వాయిదా అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కమిషన్ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. ఆదివారం నాడు అంటే రేపు ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణకు ఏపీపీఎస్సీ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటల ఎగ్జామ్స్ జరగనున్నాయి.
పేపర్-1 ఎగ్జామ్ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, పేపర్ 2 ఎగ్జామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని, చివరి నిమిషంలో చేసే తప్పిదాలతో పరీక్ష మిస్ చేసుకునే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos