ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన గల్ఫ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. దీంతో గల్ఫ్ దేశాలైన దుబాయ్, అబుదాబీలో చంద్రబాబు చేసిన మూడు రోజుల పర్యటనలో సాధించిన విజయాలపై చర్చ మొదలైంది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా విదేశాల నుంచి పెట్టుబడులు కావాలంటే అందుకు కావాల్సిన వాతావరణం తమ వద్ద ఉందని చెప్పుకోవాలి. అలాగే అవకాశాల గురించి కూడా వారికి వివరించాలి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టభయం లేదని, ప్రయోజనం ఉంటుందని ఒప్పించాలి. ఆ తర్వాత క్రమంగా పెట్టుబడులు రావడం ప్రారంభమవుతాయి. ఈ ధీమా కల్పించడంలో ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు గల్ఫ్ దేశాల టూర్ లో సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.

ఈ కోణంలో చూస్తే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలతో వస్తాం, పెట్టుబడులు పెడతామంటూ పలువురు యూఏఈ పారిశ్రామిక వేత్తలు చంద్రబాబుకు హామీలు ఇచ్చారు. మొత్తం 25 కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు.. అక్కడి పారిశ్రామికవేత్తలు, అక్కడి మంత్రులు, చివరిగా తెలుగు ప్రజలతో భేటీ అయ్యారు. ఇందులో వారికి ఉత్తరాంధ్ర కేంద్రంగా ఐటీ కంపెనీలు, ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధికి అవకాశం ఉందని వివరించారు. విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తుందనే విషయం చెప్పారు. అలాగే రాయలసీమలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు, ఏరో స్పేస్, డ్రోన్ సిటీ, హార్టికల్చర్, సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో పాటు, ఆక్వా కల్చర్ బాగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ టూరిజానికి పెద్దఎత్తున అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి కేంద్రంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి, విశాఖ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వివరించారు. సుదీర్ఘ తీర ప్రాంతం, లాజిస్టిక్స్ రంగంలో అవకాశాలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే కనెక్టివిటీని ప్రస్తావించారు. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' తో వేగంగా అనుమతులు ఇస్తున్నామని, అవసరమైతే పాలసీలు కూడా మార్చుకుంటామని హామీ ఇచ్చారు.

దీంతో యూఏఈ పారిశ్రామికవేత్తలు ఏయే రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నారో చంద్రబాబుకు వివరించారు. రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులకు శోభా గ్రూప్ ఓకే చెప్పింది. అమరావతిలో వరల్డ్ క్లాస్ గ్రంథాలయం ఏర్పాటుకు రూ.100 కోట్లు విరాళాన్ని ప్రకటించింది. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వామ్యంపై ఆసక్తి చూపింది. లాజిస్టిక్స్ దిగ్గజం షరాఫ్ గ్రూప్ ఏపీలో లాజిస్టిక్స్ పార్క్‌లు, గిడ్డంగులు స్థాపించడానికి ఆసక్తి చూపింది. బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులకు సంసిద్దత తెలిపింది. జీ 42 సంస్థ ఏఐ డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్‌, స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీ ఏర్పాటుకు ఓకే చెప్పింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ - దుబాయ్ సిలికాన్ ఒయాసిస్‌ మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై ఒప్పందం కుదిరింది. వీరంతా వచ్చేనెల విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు హాజరవుతామని సీఎం చంద్రబాబు చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos