ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌లైన వేళ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. రాజ‌కీయ కురువృద్ధుడు, కాపు నేత హ‌రిరామ జోగయ్య ఇవాళ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా మెగా డీఎస్సీపై ఓ కీల‌క అంశాన్ని ఆయ‌న కూట‌మి ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చారు. డీఎస్సీ నియామ‌కాల్లో 103 రాజ్యాంగ స‌వ‌ర‌ణ ప్రకారం షెడ్యూల్‌-14 చ‌ట్టం ద్వారా విద్య‌, ఉద్యోగాల్లో అగ్ర‌వ‌ర్ణాల్లోని పేదలకు ఈడ‌బ్ల్యూఎస్ కోటాకింద కేటాయించిన 10 శాతంలో కాపు కుల‌స్తుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరారు. ఆ విష‌యంలో ఇప్ప‌టికే స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కూడా అనుమ‌తి ఇచ్చిన విషయాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. ఈ నేప‌థ్యంలో కాపుల‌కు డీఎస్సీ నియామ‌కాల్లో ఈడ‌బ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి కాపు సామాజికవ‌ర్గ అభ్యున్న‌తికి పాటుప‌డాల‌ని హ‌రిరామ జోగయ్య ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రుల‌ను కోరారు. ఇదిలా ఉండగా ఏపీలో నేడు ఉచిత ఆన్‌లైన్‌ డీఎస్సీ కోచింగ్‌ ప్రారంభమయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ తో బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎంతో లబ్ధి చేకూరనుంది. 24 గంటలూ లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చేలా యాప్‌ ను రూపొందించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos