ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడూ ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఐదేళ్ల పాలన తర్వాత పది లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా తణుకులో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ఏనాడైనా ప్రజల్లో తిరిగారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కార్లలో వస్తే రోడ్డు పక్కన పరదాలు కట్టించేవారు, విమానంలో రావాలంటే లెక్కలేనన్ని చెట్లను నరికించే వారు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా నోరు మెదపనిచ్చే వారే కాదని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు వినేందుకే ఈ పర్యటన చేపట్టానని చంద్రబాబు తెలిపారు.

పర్యటనలో భాగంగా స్థానిక ఎన్‌టీఆర్ పార్క్ వ‌ద్ద పారిశుద్ధ్య కార్మికుల‌తో ముఖ్య‌మంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. త‌ణుకు కూర‌గాయ‌ల హోల్‌సెల్ మార్కెట్‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా కూర‌గాయ‌ల వ్య‌ర్థాల నుంచి ఎరువుల త‌యారీపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అంత‌కుముందు స్థానిక పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం చంద్ర‌బాబుకు మంత్రులు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వీరిలో మంత్రులు నిమ్మ‌ల రామానాయుడు, గొట్టిపాటి ర‌వి కుమార్‌, నారాయ‌ణ‌, ఏపీ స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ట్టాభిరామ్ త‌దిత‌రులు ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos