ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విశాఖపట్నంలో 60 ఎకరాల భూ కేటాయింపు వ్యవహారం రాజకీయరంగు పులుముకుంది. విశాఖ ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 56.36 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడం వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయని విజయవాడకు చెందిన లోక్‌సభ మాజీ సభ్యుడు కేశినేని నాని ఆరోపించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)కు భూమి కేటాయించడాన్ని ప్రశంసించారు నాని. ఇది- పలు ఐటీ దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడానికి, వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడానికి, తద్వారా రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దార్శనికతకు ఇది అద్దం పట్టిందని పేర్కొన్నారు.

అదే సమయంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూముల కేటాయింపు ప్రక్రియను కేశినేని తప్పుపట్టారు. అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ సంస్థకు 60 ఎకరాల భూమి కేటాయింపు విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. తన ఫేస్‌బుక్ అధికారిక అకౌంట్‌లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఉర్సా క్లస్టర్స్ సంస్థ ఏర్పాటైన కొన్ని వారాలకే భారీ ఎత్తున భూమిని కేటాయించడం సహేతుకం కాదని అన్నారు. ఈ సంస్థకు ఎలాంటి అనుభవం లేకపోవడం, భారీ ప్రాజెక్టులను అమలు చేయడానికి తగిన నేపథ్యం లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు.

సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి అత్యంత సన్నిహితుడని, కాలేజీలో కలిసి చదువున్నారని నాని తెలిపారు. 21 సెంచరీ ఇన్వెస్టిమెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో భాగస్వామ్యులుగా ఉండేవారని గుర్తు చేశారు. ఆ సంస్థ ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిందనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఉర్సా క్లస్టర్స్‌కు భూ కేటాయింపుల వెనుక కేశినేని చిన్ని ప్రమేయం ఉందని, ఎంపీగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని నాని ఆరోపించారు. ఇసుక, ఫ్లై యాష్, గ్రావెల్ మైనింగ్, క్యాసినో, రియల్ ఎస్టేట్ మాఫియాల్లో చిన్ని ప్రమేయం ఉందని విమర్శించారు. చిన్ని ఫొటోను దీనికి జత చేశారు.

నారా లోకేష్ పేరును కేశినేని చిన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళన ప్రజల్లో, మీడియాలో నెలకొని ఉందని, దీనిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని నాని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన భూమిని వెంటనే రద్దు చేయాలని, సంస్థ యాజమాన్యం, నిధుల మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరపాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. అవినీతి, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భూముల కేటాయింపు వ్యవహారంతో పాటు ఇతరత్రా అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నారని, ప్రభుత్వానికి చెందిన భూములు- పెట్టుబడుల ముసుగులో దోపిడీకి గురి కాకుండా చంద్రబాబు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos