ఏపీలో విద్యార్ధులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్న ఘటనలు చూస్తున్నాం. కానీ విజయనగరం జిల్లాలో చింతా రమణ అనే ప్రధానోపాధ్యాయుడు మాత్రం విద్యార్ధులకు అవే పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్ధానాలకు తీసుకెళ్లాలని భావించారు.  కానీ వారు, వారి తల్లితండ్రుల నుంచి ఆయనకు ఆశించిన సహకారం అందలేదు. దీంతో అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన సదరు హెడ్మాస్టర్ తనకు తానే శిక్ష విధించుకున్నారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పెంట జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా రమణ గుంజీలు తీసి వారికి దండం పెట్టారు. జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తంచేశారు. ఇవాళ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపర్చి, వారి ఎదురుగా ఉన్న స్టేజిపై నుండి మాట్లాడారు.

మీరంతా చదువులో వెనుకబడ్డారని 'మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము, మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. అంతటితో ఆగకుండా గుంజీలు కూడా తీయడం మొదలుపెట్టారు. హెడ్మాస్టర్ చర్యతో మొదట అవాక్కయిన విద్యార్థులు వద్దు సార్..గుంజీలు తీయవద్దంటూ వేడుకున్నారు.అయినా ఆయన మాత్రం ఆగలేదు. అయితే ఇలా హెడ్మాస్టర్ విద్యార్ధుల చదువులపై ఇంత పట్టుబట్టడానికి కారణం విద్యాశాఖ 100 శాతం ఫలితాలు సాధించాలంటూ పెంచుతున్న ఒత్తిడే అన్న విమర్శలు వచ్చాయి. 

దీంతో మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా, బొబ్బిలి మండ‌లం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ గారు పిల్ల‌ల విద్యా పురోగ‌తి అంతంత‌మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డం లేద‌ని....విద్యార్థుల‌ను దండించ‌కుండా, గుంజీలు తీసిన‌ వీడియో సోష‌ల్ మీడియా ద్వారా తన దృష్టికి వ‌చ్చిందన్నారు. హెడ్మాస్ట‌రు గారూ! అంతా క‌లిసి ప‌నిచేసి, ప్రోత్సాహం అందిస్తే మ‌న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ పిల్ల‌లు అద్భుతాలు సృష్టిస్తారని లోకేష్ తెలిపారు. వారిని దండించ‌కుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ‌క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ ఆలోచ‌న బాగుందన్నారు. ఆయననకు అభినంద‌న‌లు తెలిపారు. అందరం క‌లిసి విద్యాప్ర‌మాణాలు పెంచుదామని సూచించారు. పిల్ల‌ల విద్య‌, శారీర‌క‌, మాన‌సిక వికాసానికి కృషి చేసి, వారి బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేద్దామన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos