ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఎండలతో పాటుగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షాలు రావటంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వాగు ఉద్ధృతి పెరగడంతో ఒక్కసారిగా ఇళ్లల్లోకి నీరు చేరింది. ప్రజాశక్తి నగర్, రాప్తాడు మండలం కందుకూరు సమీపంలో ఉన్న సీపీఐ కాలనీలో నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. ఇంటి నుంచి బయటకు రాలేక కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వేసుకునే దుస్తుల నుంచి తినే ధాన్యం వరకు తడిసిపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఉద్ధృతి అధికమవుతుండటంతో ఇళ్లల్లో ఎవరు ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం సిద్దుగూరిపల్లిలో వర్షం బీభత్సం సృష్టించింది. సిద్దుగూరిపల్లిలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కదిరి- పులివెందుల ప్రధాన రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలను సందేశాల ద్వారా ఆ ప్రాంతాల ప్రజలకు పంపుతోంది. అటు అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళను తాక నున్నాయి. జూన్ 10 నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos