తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వైపు వడగాల్పుల తో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అదే సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరగనుంది. దీంతో, పలు జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ రాజస్థాన్, పొరుగు ప్రాంతాలపై నున్న ఉపరితల ఆవర్తనం నుండి గుజరాత్, మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతా వరణం శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ జిల్లాల్లో పిడుగులతోపాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్ జారీ చేసింది.

ఇటు, తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఏడు ఉమ్మడి జిల్లాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో, ఉదయం వేళ వేడి తీవ్రత.. సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఫలితంగా ఆది, సోమవారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos