బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలపడుతోంది. వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా తీరం దాటవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా రానున్న 3 రోజులు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఇవాళ, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక ఉంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. 

ఈ క్రమంలో అల్పపీడనం బలపడుతూ రేపటికి వాయుగుండంగా మారవచ్చు. వాయుగుండం కాస్త తుపానుగా మారి ఈ నెల 17వ తేదీన చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని అంచనా. తీరం దాటే సమయంలో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి ప్రస్తుతం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా. అటు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతితో పాటు తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos