కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని ఈ లేఖలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని, సాగు వ్యయానికి, రైతుల అమ్ముకునే ధరకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు. 50% నిష్పత్తిలో కాకుండా 100% నష్టాన్ని కేంద్రం భరాయించాలని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు కేంద్రం ఆదుకోవాలని ఆయన కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల వద్ద నుంచి వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు.
మిర్చి రైతుల పరిస్థితి, మార్కెట్‌లో ధరల పతనంపై ఈ నెల14 వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను కూడా సమర్పించిందని గుర్తు చేశారు. గడిచిన పది ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి, ధరలపై వివరాలను ఆయన ఈ లేఖ ద్వారా సమర్పించారు. కొన్నేళ్ల నుంచి మిర్చిసాగు విస్తీర్ణం, దిగుబడి కూడా బాగా పెరిగిందని తెలిపారు.
అదేవిధంగా ఈ ఏడాది కూడా ఉత్పత్తి అధికంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. సాధారణ మిర్చి క్వింటాలుకు రూ.11 వేలు, ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాలు రూ.13 వేలకు పడిపోయిందన్నారు. ఆ ధర గతంలో 20,000 ఉండేదని తెలిపారు. విదేశాలకు మిర్చి ఎగుమతి తగ్గిపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడిందని సీఎం వివరించారు. ధరలు పూర్తిగా తగ్గిపోవడంతో అన్నదాతలు ఆర్థిక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని సీఎం తెలిపారు. వెంటనే రైతులను ఆదుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos