ఏపీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. చిత్తూరు జిల్లాలో ఇటీవల ఒక బాలికపై దాడి జరగ్గా... దాన్ని లైంగిక దాడిగా పేర్కొంటూ కూటమి ప్రభుత్వంలో బాలికలకు, మహిళలకు భద్రత లేదని విమర్శించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో చెవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు తనపై నమోదు చేసిన పోక్సో కేసును కొట్టేయాలని చెవిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు పోక్సో చట్టం కిందకు రావని ఆయన వాదిస్తున్నారు. దీనిపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు..   పోలీసులు తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న చెవిరెడ్డి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. చెవిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసుల్ని చెవిరెడ్డి పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో చెవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసేందుకు అవకాశం దొరికింది. హైకోర్టు ఆదేశాలపై చెవిరెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. దీని ఆధారంగా పోలీసులు కూడా తదుపరి చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos