అమ్రపాలీ సహా ఐఏఎస్ అధికారులకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. కేటాయించిన రాష్ట్రానికి వెళ్లి రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టుకు రావటం సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. పిటీషన్ డిస్మిస్ చేస్తే మళ్లీ కోర్టుకు వస్తారని పేర్కొంది. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్లి పని చేయాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఆ తరువాతనే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో అధికారుల కేటాయింపుల పైన డీఏపీటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వారు రిపోర్టు చేయాల్సి ఉంది.

డీవోపీటీ బదిలీ చేసిన ఐఏఎస్‌ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రొనాల్డ్‌రోస్‌, శివశంకర్‌, హరికిరణ్‌, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌.. టీవోపీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. తమను బదిలీ చేయకుండా యథావిధిగా పనిచేసే చోటనే కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను నిలిపివేయడానికి క్యాట్‌ నిరాకరించింది. కేటాయించిన రాష్ట్రంలో చేరడానికి డీవోపీటీ నేటి వరకు గడువు విధించింది. దీంతో తాజాగా బుధవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అత్యవసరంగా విచారించాలని కోరారు.

వీరి పిటీషన్లను జస్టిస్ అభినంద్ కుమర్ శావిలి బెంచ్ విచారించింది. ఏ అధికారి ఎక్కడ పని చేయాలో చెప్పే అధికారం కోర్టుకు లేదని డీఓపీటీ న్యాయవాది వాదించారు. ఏ అధికారి ఎక్కడ పని చేయాలో కేంద్రంలోని సీనియర్ అధికారులు నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. హైకోర్టు సైతం విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా సేవ కోసమే అధికారులు ఉన్నారని పేర్కొంది. ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అధికారుల పిటీషన్ డిస్మస్ చేస్తే తిరిగి అప్పీల్ కు వెళ్తారని అభిప్రాయ పడింది. ట్రిబ్యునల్ తిరస్కరిస్తే కోర్టుకు రావటం సరి కాదన్నారు. ముందు నియమించిన చోటకు వెళ్లి రిపోర్టు చేయాలని కోర్టు అధికారులకు సూచించింది.

క్యాట్...తరువాత కోర్టు సైతం అధికారులకు షాక్ తగిలింది. ఫలితంగా ముందుగా డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించిన అధికారులు ఈ సాయంత్రం లోగా రిపోర్ట్ చేయాల్సి ఉంది. అదే విధంగా ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించిన వారు సైతం అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు రిపోర్టు చేయనున్నారు. అధికారుల వాదన వింటామని..ఇప్పుడు జోక్యం చేసుకోవటం సరి కాదని కోర్టు తేల్చి చెప్పింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఫలితంగా అధికారులు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ముందుగా విధుల్లో చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos