టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు హైదరాబాద్ కోర్టులో భారీ ఊరట లభించింది. తనపై జరుగుతున్న విషప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేస్తూ, ఇకపై ఆయనపై ఎలాంటి అసత్య వార్తలు ప్రసారం లేదా ప్రచారం చేయరాదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ప్రచురితమైన కథనాలు, వీడియోలను తక్షణమే తొలగించాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు గూగుల్, ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తనపై ఎలాంటి ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ప్రసారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలను కోర్టు స్పష్టంగా ఆదేశించిందని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రచురితమైన లేదా ప్రసారమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నట్లు వివరించారు. ఇదే సమయంలో గూగుల్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సైతం సంబంధిత కంటెంట్‌ను తమ సైట్ల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించినట్లు నాయుడు పేర్కొన్నారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా తనపై దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. "సత్యం చివరకు గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos