కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'ఫార్వర్డ్ లుకింగ్' బడ్జెట్‌గా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా  మార్చే దిశగా ఈ బడ్జెట్ అడుగులు వేస్తోందని ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంఎస్ఎంఈల బలోపేతం, మహిళలు మరియు యువత సాధికారతకు ఈ బడ్జెట్ గొప్ప ఊతాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ​రాష్ట్ర మౌలిక సదుపాయాల పరంగా ఈ బడ్జెట్ అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై వంటి హైస్పీడ్ రైల్ కారిడార్లు అమరావతి, తిరుపతి, పలమనేరు వంటి ప్రాంతాలను అనుసంధానిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. అలాగే సెమీకండక్టర్ రంగానికి రూ. 40 వేల కోట్లు కేటాయించడం, అరకు వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, మరియు కొబ్బరి, జీడి మామిడి వంటి పంటలకు మద్దతునిచ్చే చర్యలను ఆయన స్వాగతించారు. విశాఖపట్నం ఐటీ హబ్‌గా ఎదిగేందుకు ఈ బడ్జెట్ బాటలు వేస్తోందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు వస్తాయని, తద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఏపీ దూసుకుపోతుందని అన్నారు. లాజిస్టిక్స్ మరియు పునరుత్పాదక ఇంధన రంగాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos