మంగళగిరి : కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని ఆమె ప‌రామ‌ర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయాలైన పోలీసులకు ధైర్యం చెప్పిన మంత్రి, వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల నుంచి సీజ్ చేసిన పేలుడు పదార్థాలను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనలో ఎస్సై, కోర్ట్ కానిస్టేబుల్ మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడినట్లు వివరించారు. అబ్దుల్లా అనే కానిస్టేబుల్‌కు 50-60 శాతం గాయాలున్నాయని, మిగతా వారికి ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గాయపడిన పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos