రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీలో వైసీపీ మరింత దిగజారుతోందని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన తెనాలి ఘటనను సైతం వైసీపీ కులం, మతం రంగులద్ది రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుతోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెనాలి ఘటనకు సంబంధించిన యువకులపై పలు కేసులు ఉన్నాయని, పోలీసులపైనే వారు చేయి చేసుకున్నారని డీజీపీ వెల్లడించినట్లు అనిత గుర్తుచేశారు. అలాంటి గంజాయి బ్యాచ్ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళుతున్నారని... ఇది కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి, కులమతాలను రెచ్చగొట్టడానికేనని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే, తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ సమర్థించుకున్నారని గుర్తుచేశారు.

వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై కొట్టినా, రాజమండ్రిలో ఇసుక మాఫియాపై మాట్లాడిన వరప్రసాద్‌కు పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేసినా ఆనాడు జగన్ ఎందుకు స్పందించలేదని, వారి ఇళ్లకు వెళ్లి ఎందుకు పరామర్శించలేదని అనిత నిలదీశారు. పులివెందులలో మహిళ హత్యకు గురైనప్పుడు తాము వెళితే కేసు పెట్టారని అన్నారు. తమ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని, వైసీపీ నేతలు పోలీసులకు అడ్డు తగలకుండా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని ఆమె సూచించారు. పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించవద్దని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos