ఏపీ ప్రభుత్వం సంక్షేమ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. 3.22 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేసారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లుగా, మూల ధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు గా అంచనా వేసారు. ఇక, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు గా కేశవ్ అంచనాగా వెల్లడించారు. ఈ బడ్జెట్ లో పలు రంగాలకు ప్రాధాన్యత లభించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు కేటాయించారు. ఇక.. పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు కేటాయించగా.. సంక్షేమ రంగానికి భారీగా నిధులు ప్రతిపాదించారు. అందులో.. ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్ల, బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. అదేవిధంగా.. మహిళా శిశు సంక్షే మం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. రాజకీయంగా పట్టు సాధించే క్రమంలో వ్యూహాత్మకంగా సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు చేసినట్లు స్పష్టం అవుతోంది. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఏకంగా 47,456 కోట్లను కేటాయించింది. ఇక.. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు  కేటాయింపులు చేసారు.

కీలకమైన పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు, ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు,ఆర్‌అండ్‌బీకి రూ.8,785 కోట్లు ప్రతిపాదించారు. యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు కేటాయించగా... గృహ మంత్రిత్వశాఖకు రూ.8,570 కోట్లు ప్రతిపాదించారు. ఈ సారి ప్రత్యేకంగా తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మద్యం, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు. కీలక హామీల అమల్లో భాగంగా పోలవరం కోసం రూ.6,705 కోట్లు, జల్‌జీవన్‌ మిషన్‌ కోసం రూ.2800 కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos