టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మకు ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై పలు స్టేషన్లలో నమోదైన కేసులపై ఊరట కల్పిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. వైసీపీ అధినేత జగన్ పై రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై రాష్ట్రంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా వర్మ ప్రకాశం జిల్లా పోలీసుల ముందు హాజరయ్యారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన కేసులన్నీ కొట్టేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

రాంగోపాల్ వర్మపై ఆరు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వర్మ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రకాశం జిల్లా మద్దిపాటు పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. అదే సమయంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కావాలని షరతు పెట్టడంతో ఆ తర్వాత వర్మ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఏకంగా ఈ కేసులన్నీ కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వ స్పందన వచ్చే వరకూ ఆయనకు ఊరట లభించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos