ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడి జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి ప్రయాణీకుల వద్ద నగదు, బంగారంతో పాటు విలువైన వస్తువులను సైతం ఎత్తుకెళ్లడం సర్వత్రా కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్‌ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అయితే ఆ సమయంలో అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు రైలులోకి చొరబడ్డారు. ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం పది బోగీల్లో దోపిడీకి పాల్పడ్డట్టు సమాచారం. ఈ ఘటనపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా ప్లాన్ తోనే ఆ ఘటనకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రంగం లోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు చెబుతున్నారు. ప్రయాణీకుల నుంచి తీసుకెళ్లిన మొత్తం ఎంత ఉండొచ్చు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos