ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం తన అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఇటీవల కామన్వెల్త్ మహిళా సదస్సులో ఐదు రోజుల పాటు పాల్గొని తిరిగి వచ్చిన ఆమె ఈరోజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పురందేశ్వరి పలు జాతీయ, స్థానిక అంశాలపై స్పందించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని వ్యాఖ్యానించారు స్థానిక అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ, రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు. తన కృషి ఫలితంగా కొవ్వూరులో రెండు రైళ్లు, అనపర్తిలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం కల్పించగలిగామని తెలిపారు. పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, మొంథా తుపాను వల్ల కలిగిన నష్టంపై కూడా కేంద్రంతో చర్చించానని ఆమె పేర్కొన్నారు. అనంతరం గోదావరి పుష్కరాల నిర్వహణపై అధికారులతో పురందేశ్వరి సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర పనులకు సంబంధించిన అంచనాలను తక్షణమే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శాఖాపరమైన విధానాలపై వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos