మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ అధినేత జగన్ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. మొన్నటి దాకా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విజయ సాయిరెడ్డి. ఈమేరకు జగన్ ప్రెస్ మీట్ పై ఏమన్నారంటే... "నేను మారను.. నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. పదవి వచ్చాక నువ్వే మారిపోయావు. నేను ఎప్పడూ ఇలాగే ఉన్నాను. మూడు దశాబ్దాలుగా నాకు రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. నేను ప్రలోభాలకు లొంగను. ఎవరీకీ భయపడను" అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు జగన్ మాట్లాడుతూ విజయ సాయిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయ సాయిరెడ్డి అని, ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా 3 ఏళ్లు పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగా.. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడని విమర్శించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక విజయసాయి రెడ్డి.. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు, జగన్ ను సంప్రదించిన తర్వాతే నిర్ణయం ఈ తీసుకున్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు. తన రాజీనామాతో ఏపీలో కూటమి ప్రభుత్వానికే లబ్ధి చేకూరుతుందని అన్నారు. మొత్తానికి సాయి రెడ్డి రాజీనామా ఇద్దరు నేతల మధ్య ఆరని చిచ్చు రేపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos