మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కార్యాచరణ పైన కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహిద్దా మని, 2019 నాటి పరిస్థితులు రాష్ట్రంలో రిపీట్ అవుతున్నాయని చెప్పిన జగన్ తన పాదయాత్ర పైన స్పష్టత ఇచ్చారు.పార్టీ నిర్మాణం పూర్తి చేస్తూనే ఇక.. జనంలోనే ఉండేలా కార్యాచరణ ఖరారు చేస్తామని జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. 2029 లో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తూ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమ‌న్నారు. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద మనం ప్రధానంగా ధ్యాస పెట్టామని, 2027 నుంచి పాదయాత్ర 2.0 ప్రారంభిస్తానని జగన్ ప్రకటించారు. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం  కావాలని, పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలని జగన్ సూచించారు.

ప్రతి ఇంటికి పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్ధితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ చెప్పుకొచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతుభరోసా కనిపించడం లేదు. ప్రతి పథకం కనపడకుండా పోతోందని పేర్కొన్నారు. విచ్చల విడిగా అవినీతి జరుగుతోందని, రూపాయికే రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణ మైన స్థాయికి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. కేడర్‌ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారని జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు పాలన చూసిన తరువాత తనలోనూ మార్పు వచ్చిందని జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్‌ 2.0 ఖచ్చితంగా వేరే విధంగా ఉంటుం దని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో కేడర్ కు చేయాల్సినంతగా చేయలేదని చెప్పిన జగన్.. వారు తనకు అండగా నిలుస్తున్నారనే కారణంతోనే వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. వారి కోసం అండగా నిలవాల్సిన బాధ్యత తన పైన ఉందన్నారు. కాగా... జగన్ సమక్షంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన మాజీ నేతలు వైసీపీలో చేరారు. ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస‌రావు తో పాటుగా పలువురిని పార్టీ కండువా కప్పి జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. జ‌గ‌న్‌ను మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తామని నేతలు వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos