మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయాల గురించి  సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్మంతా రాజకీయాలకు దూరమేనని తన బదులు పవన్ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.‌ బ్రహ్మానందంతో పాటు ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ  ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ... సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ... అక్కున చేర్చుకుంటూ...‌ ఆ కళామతల్లితో ఉంటానని అన్నారు. 

చిరంజీవి ఇటీవల దేశంలోని అగ్ర నేతలతో   కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి చిరంజీవి పాల్గొన్నారు. అంతే కాదు... ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రెండు మూడు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చిరు రాజకీయ ప్రయాణం గురించి చర్చ మరొకసారి తెరపైకి వచ్చింది.
చిరంజీవికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేసిందనే పుకార్లు షికార్లు చేశాయి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారని, తన ప్రాథమిక సభ్యత్వానికి ఆయన ఇంకా రాజీనామా చేయలేదని, అందువల్ల ఆయనను కాంగ్రెస్ సభ్యుడిగా చూడాలని ప్రచారం సైతం మొదలైంది. ఇటీవల జరిగిన లైలా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో చిరు మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాంతో ఇక ఈ జన్మలో తాను రాజకీయాలలోకి వచ్చేది లేదని చిరంజీవి స్పష్టంగా చెప్పేశారు. 

నేను రాజకీయంగా వెళ్లడం అనేది లేదని .. ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని.. రాజకీయంగా ముందుకు వెళ్లడానికి, నేను అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, నేను అనుకున్న సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని చిరంజీవి తెలిపారు. తనకు కొత్త దర్శకులతో పని చేయాలని ఉందనే ఆకాంక్షను 'బ్రహ్మ ఆనందం' వేడుకలో చిరంజీవి బయట పెట్టారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తాను ఒత్తిడికి గురయ్యానని, నవ్వడం అనేది మానేశానని తన భార్య అంటే తనలో హాస్య గ్రంథులు పోయాయేమోనని సందేహం కలిగిందన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ త్వరగా పూర్తి చేస్తే నాతో ఏమైనా సినిమా చేసే ఆలోచన అతడిలో కలుగుతుందేమోనని సరదాగా చిరు వ్యాఖ్యానించారు.

కాగా చిరంజీవి ... నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆయనను వాడేసుకుందామన్న ఆలోచనను ఆపేసి.. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తే మంచిదని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారని రాజకీయ, సినీ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos