ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తవారి నియామకానికి సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సమర్థ అధికారిని నియమించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఈ నెల తో పూర్తి కానుంది. దీంతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యంగా మారింది. దీనిపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు ప్రచారం నడుస్తోంది.
ఈ క్రమంలో సీనియారిటీ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి సీఎస్ గా అవకాశం దక్కాలి. అయితే ఆమె వ్యవహార శైలి వల్ల మంచి ఛాన్స్ మిస్సయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆమె వ్యవహరించిన తీరుతో జైలుకు వెళ్లారు. చిన్న వయసులో ఐఏఎస్ అయిన ఆమె.. తన భవిష్యత్తును చేజేతులా ఇబ్బందుల్లో పెట్టుకున్నారు. జైలు నుంచి రావడంతో పాటు అనారోగ్యం నుంచి కోలుకోవడంతో తెలంగాణ క్యాడర్ కు వెళ్లారు. కానీ జగన్ సీఎం అయ్యాక మళ్లీ లాబీయింగ్ చేసి.. ఏపీ క్యాడర్ కు వచ్చారు. అమరావతి రాజధాని విషయంలో అతిగా ప్రవర్తించారు. వైసీపీ అధికారానికి దూరమైన తరువాత ఇప్పుడు పోస్టింగ్ కూడా లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా... ఇప్పుడు కొత్త సీఎస్ కోసం చంద్రబాబు సీనియర్ ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీనియారిటీ జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. అయితే మొదటి స్థానంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ విషయంలో అన్ని సవ్యంగా ఉంటే.. చంద్రబాబు సీఎస్ గా శ్రీలక్ష్మికి తప్పకుండా అవకాశం ఇచ్చి ఉండేవారని అత్యున్నత అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సో.. శ్రీలక్ష్మి తన వ్యవహార శైలి వల్ల గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిందని సర్వత్రా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos