ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఇండిగో విమానాల వివాదం పైన ఒక జాతీయ ఛానల్ లో జరిగిన చర్చ.. తదనంతరం పరిణామాల పైన చంద్రబాబు ఆరా తీసారు. కేంద్ర పరిధిలోని విమానాల అంశం మనకు ఎందుకని ప్రశ్నించారు. పార్టీ లైన్ గురించి అధికార ప్రతినిధులకు అవగాహన రావటం లేదని అసహనం వ్యక్తం చేసారు. ఇంత జరుగుతుంటే తనకు ఎందుకు చెప్ప లేదని ప్రశ్నించిన చంద్రబాబు..ఇక నుంచి పూర్తి కసరత్తుతోనే చర్చల్లో పాల్గొనాలని తేల్చి చెప్పారు. పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని విమానాల విషయంలో ఒక జాతీయ ఛానల్ లో జరిగిన చర్చ.. తరువాత వివాదం పైన సీఎం చంద్రబాబు స్పందిస్తూ..  అనవసర వివాదాన్ని తెచ్చుకున్నామని అభిప్రాయపడ్డారు. వివాదం పెద్దదయ్యే వరకూ తనకు ఎందుకు చెప్పలేదని పార్టీ నేతలను ప్రశ్నించారు. చర్చకు మరింత కసరత్తుతో వెళ్లి సమయ స్పూర్తితో వ్యవహరించి ఉండాల్సిందని పేర్కొన్నారు. చిన్న విషయాన్ని పెద్దది చేసారని ..ఛానల్ ను బహిష్కరిస్తున్నామని చెప్పటం ద్వారా మరింత వివాదం చేసారని సీఎం చంద్రబాబు అసమనం వ్యక్తం చేసారు. పార్టీ లైన్, ప్రభుత్వ విధానాలపై అధికార ప్రతినిధులకు మార్గదర్శకం చేయటంలో వైఫల్యం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరిగే తాజా పరిణామాలపై పార్టీ అధికార ప్రతినిధులు పూర్తి అవగాహన కలిగి మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. జాతీయ అంశాలపై మాట్లాడే సమయంలో జాగ్రత్తగా లేకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో  ఇప్పుడు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరిగే తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవ్వాలని, దానిలో మన పాత్ర ఎంతవరకు ఉన్నదనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.

బీజేపీ నాయకులు ఏదైనా అంశంపై మాట్లాడాల్సి వస్తే.. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒకే లైన్‌లో మాట్లాడతారని, మన పార్టీ నాయకులూ అదే తరహాలో స్పందించాలని నిర్దేశించారు. ఒక అంశంపై మన పార్టీ లైన్‌ ఏమిటి.. ప్రభుత్వ విధానం ఏమిటి.. ఆ అంశంలో మన పాత్ర ఎంత వరకు ఉంటుందనే విషయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడవద్దని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, అదే సమయంలో ఎవరి పరిధి ఏమిటనే దానిపై పూర్తి అవగాహనతో ముందుకెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos