కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. 243 మంది పని చేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి... 26 వేల మంది పని చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి మాత్రం మనసు రావడం లేదని దుయ్యబట్టారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీఎస్ రూ. 15 వేల కోట్ల నిధులు రాబట్టిందని... కేంద్రంలోని ఎన్డీయేకు ఊపిరి పోసిన టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. 

విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెబుతున్నవన్నీ అసత్యాలేనని, స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేనంటూ షర్మిల ట్వీట్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కోరుతూ 1,400 రోజులుగా కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు మాత్రం ప్రధానితో మిట్టల్ స్టీల్ గురించి చర్చిస్తున్నారని షర్మిల విమర్శించారు.

మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కు ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడాలని కోరుతున్నారని... ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల ఆర్థిక సహాయం ఇచ్చినట్లే.. వైజాగ్ స్టీల్ కు కేంద్రం నిధులు ఇవ్వాలి.  ప్లాంట్ లో 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి ప్రారంభించాలి. భవిష్యత్ లో 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి. ఇవి సాధించడం చేతకాకపోతే వెంటనే ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి టీడీపీ, జనసేన తప్పుకోవాలి” అని ట్వీట్‌లో షర్మిల పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos