ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో తనకు నెలకొన్న కుటుంబ ఆస్తుల వైరాన్ని రాజకీయం ద్వారా మరో స్దాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆయన చెల్లి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మాటల దాడిని మరింత తీవ్రం చేశారు. ఇప్పటికే జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని, వెళ్లకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేసేయాలని ఒత్తిడి పెంచుతున్న షర్మిల.. దీనికి రోజుకో కారణాన్ని లింక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు, బడ్డెట్ ను జత చేసి పోస్టు పెట్టారు.

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వైసీపీ కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందన్నారు. తాము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నారు. మీకూ, మాకు పెద్ద తేడా లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డికి 38 శాతం ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, మీకు మాకు తేడా లేదని గుర్తుచేశారు.

38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోని వైసీపీని నిజానికి ఒక అప్రాధాన్య పార్టీగా మార్చింది జగనే అన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్ట లేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన అప్రాధాన్య పార్టీ అయిందని అన్నారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని... సొంత మైకుల ముందు కాకుండా ..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని జగన్ కు షర్మిల సూచించారు. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయాలని కోరారు.

ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలన్నారు. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని... లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos