ఏపీలో వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకోవడం, ఇవాళ ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దాన్ని వెంటనే రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ తర్వాత విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా తన రాజీనామా వైసీపీకి నష్టం చేస్తుందని, కూటమికి మేలు చేస్తుందంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ తో అధికార కూటమి అలర్ట్ అయింది.

సాయిరెడ్డి కామెంట్స్ పై కూటమి నేతలు వెంటనే స్పందించారు. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర నేతలు కూడా స్పందిస్తున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసినా విజయసాయిరెడ్డి చట్టం నుంచి తప్పించుకోలేరని గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సాయిరెడ్డి వల్ల పడిన ఇబ్బందుల్ని ఇంకా విశాఖ ప్రజలు మర్చిపోలేదన్నారు. వైసీపీ మునిగిపోయే నావ అని ఎప్పుడో చెప్పామని, అది ఇప్పుడు నిజం అవుతోందన్నారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఇవాళ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగడంపై స్పందించారు. రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. ఆయనకు గొడ్డలి కలలోకి వచ్చిందేమో అంటూ చమత్కరించారు.

ఇక బెజవాడ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సైతం తన ప్రత్యర్ధి సాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ నిర్ణయం జగన్, సాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా అని అన్నారు. జగన్ కి తెలిసే ఇదంతా జరుగుతోందని అన్నారు. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడతున్న నాటకం ఇదంతా అని అన్నారు. చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు అని అన్నారు. విజయసాయి రెడ్డి చంద్రబాబును అన్న ప్రతి మాట తమకు ఇంకా గుర్తు ఉందని, చేసినవి అన్నీ చేసి ఈరోజు రాజీనామా చేసి వెళ్ళిపోతా అంటే కుదరదన్నారు. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలని అన్నారు. సీబీఐ విజయసాయిని దేశం విడిచి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos