ఏపీ ప్రభుత్వం పీ-4 పథకాన్ని ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను తాజాగా ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పీ-4 అంటే.. పబ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌-పార్టనర్ షిప్‌. తొలుత ఉగాది నాడు పీ-4 పోర్టల్‌ను ఆవిష్కరిస్తారు. దీని ద్వారా పీ-4 విధానాన్ని ప్రజలకు సమగ్రంగా వివరించనున్నారు. అనంతరం వారి నుంచి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుంటారు. ఈ క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇక, ఈ విధానానికి వస్తే.. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది.. పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వాలి. దీనిలో పారిశ్రామిక వేత్తలు,ఎన్నారైలు కీలక పాత్ర పోషిస్తారని సర్కారు అంచనా వేసింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా.. పీ-4 ప్రధానంగా దోహద పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. `స్వర్ణ ఆంధ్ర విజన్-2047`లో భాగంగా ప్రతి ఏటా 15 శాతం వృద్ధి రేటును సాధించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో గ్రామ, మండల, నియోజకవర్గం, జల్లా స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందిస్తారు. ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమిస్తారు. వీరు ఆయా ప్రాంతాలలో పర్యటించి.. ప్రజల అవసరాలు.. వారిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు మరింత మెరుగులు దిద్దేందుకు కూడా అవకాశం ఉంటుందని, నిజమైన లబ్ధి దారులకు ఫలాలు అందుతాయని సర్కారు అంచనా వేస్తోంది. ఇక, పీ-4 ద్వారా రాష్ట్ర స్థాయి రహదారులపై టోల్ గేట్లు పెట్టనున్నారు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు కూడా పీ-4ను అమలు చేయనున్నారు. తద్వారా ఆయా ప్రాజెక్టుల విషయంలో బాధ్యతాయుత నిర్వహణకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి పీ-4 విధానం పకడ్బందీగా అమలవుతుందని, తద్వారా రాష్ట్రంలో సత్వర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos